'వైయస్ఆర్ పథకాల అమలు జగన్‌కే సాధ్యం'

అనకాపల్లి (విశాఖపట్నం జిల్లా):

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలుచేసే సత్తా ఆయన తనయుడు,  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డికి మాత్రమే ఉందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సలహాదారుడు కొణతాల రామకృష్ణ అన్నారు. త్వరలో జరిగే ఏ ఎన్నికల్లోనైనా పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమన్నారు.  రానున్న రోజులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీవేనని, కార్యకర్తలంతా ఆయా ప్రాంతాల్లోని సమస్యలపై స్పందించి ప్రజలకు అండగా నిలవాలని సూచించారు.

     స్థానిక పార్టీ క్యాంపు కార్యాలయంలో గాజువాకకు చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొణతాల సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నేతలు, యువకులకు కొణతాల పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొణతాల వారినుద్దేశించి మాట్లాడారు. రాజకీయంగా శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిని ఎదుర్కొనే ధైర్యం లేకనే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతూ శ్రీ జగన్మోహనరెడ్డికి బెయిల్ రాకుండా చేస్తున్నాయని కొణతాల ఆరోపించారు.

Back to Top