వైయస్ఆర్ కాంగ్రెస్ వైపు యువత చూపు

జిన్నారం:

మెదక్ జిల్లా జిన్నారం మండలం మంగంపేట గ్రామానికి చెందిన యువకులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు అంజిరెడ్డి  కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరేందుకు యువకులు ఎక్కువ సంఖ్యలో ముందుకు వస్తున్నారన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ర్ట ప్రజలకు న్యాయం జరుగుతుందనే భావన ప్రజల్లో ఉందన్నారు. నియోజకర్గంలోని అన్ని గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పార్టీలో సరైన న్యాయం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో పార్టీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. కార్యక్రమంలో  యువత మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, నాయకులు ఆంజనేయులు, రమేష్, మహేష్, వీరేష్, శంకర్, సుకిందర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుగౌడ్ సమక్షంలో
సంగారెడ్డి రూరల్: సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన పలువురు యువకులు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ప్రభుగౌడ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ పేదల కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఇప్పటికీ పేదల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచారన్నారు.  శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపన్ని ఆయనకు బెయిలు రాకుండా చేస్తోందని ఆరోపించారు. పార్టీలో చేరిన వారిలో నవీన్, ఉదయ్‌కిరణ్, అశోక్ జాదవ్, రాఘవేంద్ర చారి, నితీష్, మణి, బాలకృష్ణ, సునిల్ వర్మ, నవీన్ కుమార్, ప్రకాశ్‌తో పాటు పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు వహీద్‌ఖాన్, శివశంకర్ పాటిల్, ఉస్మాన్, వైద్యనాథ్, సుధాకర్ గౌడ్, రవీందర్, జగదీష్, మాణయ్య, నర్సింలు, సుభాన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top