వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వెబ్‌సైట్‌ ప్రారంభం

హైదరాబాద్, 17 అక్టోబర్‌ 2012: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధికారిక వెబ్‌సైట్ వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ డా‌ట్ కా‌మ్ ను పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై‌యస్ విజయమ్మ బుధవారం‌ ఉదయం ఆవిష్కరించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో www.ysrcongress.comను ఆమె ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్లో పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరిచారు.  తెలుగు‌, ఇంగ్లీషు రెండు భాషలలో ఏర్పాటు చేసిన ఈ వెబ్‌సైట్ ద్వారా 'ఆ‌న్‌లైన్‌లో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ'లో చే‌రే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో కొత్త పార్టీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో ఈ వెబ్‌సైట్‌లో సమగ్ర కథనాన్ని పొందుపరించారు.

పార్టీకి, ప్రజలకు అనుసంధానంగా ఈ వెబ్‌సైట్ నిలుస్తుందని వై‌యస్ విజయమ్మ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ, విదేశాల్లో ఉన్న వారికి వెబ్‌సైట్‌ అన్ని రకాల మంచి సమాచారాన్ని అందించాలని విజయమ్మ ఆకాంక్షించారు. ప్రపంచ‌ వ్యాప్తంగా ఉన్న వైయస్‌ఆర్ అభిమానులకు ఈ సై‌ట్ ప్రయోజనకారిగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అగ్ర నాయకులు ఎ‌స్‌. రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి,  కొణతాల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు.

సానుకూల దృక్ఫథం వెబ్‌సైట్‌ విధానం:ఎం .వి.రావ్:
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వెబ్‌సైట్‌ను మామాలు పార్టీ వెబ్‌సైట్‌లా కాకుండా చక్కని సానుకూల దృక్ఫథంతో తీర్చిదిద్దినట్లు సంపాదకుడు ఎం.వి.రావ్ తెలిపారు. ఎప్పటికప్పుడు వార్తలు, విశేషాలు, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు, ప్రజల వద్దకు తీసుకువెళ్ళేలా తీర్చిదిద్దినట్లు చెప్పారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి నిర్వహించిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ విస్తృతంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు, అభిమానులకు అందిస్తాం.  వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి స్థాపించిన వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేసిన అనేక కార్యక్రమాలు, పోరాటాలు, ఆయన లక్ష్య సాధన కోసం ఈ వెబ్‌సైట్‌ ఒక మాధ్యమంగా ఉపయోగపడుతుందన్నారు.



Back to Top