వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం

కూసుమంచి:

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని మరిచిందనీ, అభివృద్ధిని పట్టించుకోవడం లేదనీ  మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కూసుమంచిలో ఏర్పాటైన వైయస్‌ఆర్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్.రాజశేఖర రెడ్డి హయాంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు సాగాయన్నారు. దివంగత జలగం వెంగళరావు హయాంలో జిల్లాలో జరిగిన అభివృద్ధి కూడా ఈ ప్రాంత వాసులకు తెలుసనీ, ఆయన సాగర్ నీటిని జిల్లాకు తెచ్చి రైతులను ఆదుకున్నారనీ చెప్పారు. జిల్లాకు చెందిన మంత్రికి ప్రాజెక్టులపై అవగాహన లేదని విమర్శించారు. రైతాంగం సుభిక్షంగా ఉంటేనే అన్ని రంగాలు అభివృద్ధవుతాయని చెప్పారు. వైయస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే రాష్ట్రం అభివృద్ధవుతుందని చెప్పారు. ఖమ్మంలో ఈ నెల 19న పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో  వైయస్‌ఆర్ సీపీలో  చేరనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విజయవంతం చేయాలని కోరారు. పార్టీ యువజన విభాగం మూడు జిల్లాల కో-ఆర్డినేటర్ సాధు రమేష్ రెడ్డ్డి మాట్లాడుతూ... జిల్లాలో వైయస్‌ఆర్ కుటుంబానికి, పార్టీకి ఎంతో ఆదరణ ఉందని అన్నారు. ఇటువంటి తరుణంలో, జలగం వెంకటరావు చేరికతో పార్టీకి నూతనోత్తేజం వస్తుందన్నారు. సమావేశంలో కార్మిక విభాగం రాష్ట్ర కన్వీనర్ చాగంటి రవీందర్ రెడ్డి, పార్టీ నాయకులు జర్పుల బాలాజీ నాయక్, పిట్టా సత్యనారాయణ రెడ్డి, జిల్లేపల్లి సైదులు, చాగంటి వసంత, బండ్ల సోమిరెడ్డి, బజ్జూరి వెంకటరెడ్డి, సోందుమియా, బారి శ్రీనివాస్, కొండా నర్సయ్య, కిషన్ నాయక్, బయ్య లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top