వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

హైదరాబాద్

:  ఇతర పార్టీలకు చెందిన నాయకులు సోమవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద సంఖ్యలో చేరారు. పాయకరావుపేట ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు, చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ చేరిన విషయం తెలిసిందే. విశాఖకు చెందిన , టీడీపీ నేత కుమార్,  ప్రముఖ వైద్యురాలు పోలిశెట్టి సునీత, భీమిలికి చెందిన ప్రముఖ విద్యావేత్త భూపతిరాజు అచ్చుతరామరాజు కూడా పార్టీలో చేరారు. విజయమ్మ సమక్షంలో వారు పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు భువనగిరిలో నిర్వహించనున్న సభలో విజయమ్మ సమక్షంలో తెలంగాణ యువ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి చేరనున్నారు. తెలుగు రైతు ఉపాధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి అనంతపురంలో షర్మిల సమక్షంలో పార్టీలో చేరనున్నారు.

Back to Top