వైయస్ఆర్‌ కాంగ్రెస్‌లోకి 'గాంధేయం' యాజమాన్యం

మహబూబ్‌నగర్:

రైతు సమస్యల కోసం జిల్లా కేంద్రంలో నిర్వహించిన 48 గంటల దీక్ష శిబిరం ముగింపు  కార్యక్రమంలో గాంధేయం పత్రిక యాజమాన్యం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.  మైనార్టీ నేత మహ్మద్ రషీద్ ఖాన్ ఆధ్వర్యంలో గాంధేయ పత్రిక యాజమాన్య ప్రతినిధులు ఆ పార్టీలో చేరారు. జిల్లా పార్టీ కన్వీనర్ ఎడ్మ  కిష్టారెడ్డి, సీజీసీ సభ్యురాలు వంగూరు బాలమణెమ్మ, జిల్లా పరిశీలకులు బండారు మోహన్‌రెడ్డి కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎడ్మ కిష్టారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రంగాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి ఒక్క శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి వల్లనే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారన్నారు. రాజకీయంగా అత్యున్నత స్థానానికి ఎదుగుతున్న తమ అధినేతను అడ్డుకోవడానికే కాంగ్రెస్, టీడీపీలు కుట్రపన్ని జైలు పంపాయని ఆరోపించారు. దివంగత మహానేత వైయస్ఆర్ కుటుంబం రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారానికి  నిరంతరం కృషి చేస్తోందన్నారు. మహానేత ప్రవేశపెట్టిన పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుంటే, దానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని దుయ్యబట్టారు.  గాంధేయం పత్రిక చీఫ్ ఎడిటర్ రషీద్  మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి వైయస్ఆర్ కాంగ్రెస్ వల్లనే సాధ్యమన్న నమ్మకంతో పార్టీలో చేరామని అన్నారు. గాంధేయం పత్రిక ఎడిటర్ ఇక్రముద్దీన్, ఎడిషన్ ఇన్‌చార్జి సూరి,ప్రతినిధులు ఖాజ, అయ్యూబ్, నిజాముద్దీన్, అజీం, పప్పు, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top