వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరిన డాక్టర్ కుడిపూడి‌

హైదరాబాద్, 9 మే 2013: పశ్చిమగోదావరి జిల్లా‌కు చెందిన డాక్టర్ కుడిపూడి శ్రీనివా‌స్ బుధవారంనాడు వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నుంచి ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీచేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీనివాస్‌తో పాటు వచ్చిన టిడిపి నాయకుడు డాక్టర్ ఎ.‌ సాంకృత్యాయన్‌కు కూడా పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆచంట నియోజకవర్గం సమన్వయకర్త మల్లుల లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు ఎంఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Back to Top