వైయస్ఆర్ కాంగ్రెస్‌లో భారీగా చేరికలు

అనంతపురం:

జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాప్తాడు నియోజకవర్గ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో 150 మంది, సోమందేపల్లి మండలం నడింపల్లి పంచాయతీలోని మూడు గ్రామాలకు చెందిన 200 కుటుంబాలు, బుక్కరాయసముద్రంలో 200 మంది పార్టీలో చేరాయి.  రాప్తాడు నియోజకవర్గ పార్టీ నాయకుడు తోపుదుర్తి  ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో రాప్తాడుకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు 150 మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో పలు సామాజిక వర్గాలకు చెందిన నాయకులు రామాం జి, చండ్రాయుడు, నల్లన్న, నారాయణస్వామి, ముత్యాలన్న, చంద్రశేఖర్, తిరుపాలు, ఉమాశంకర్, బోయ రామాంజి, శ్రీధర్, శేఖర్, వెంకటేష్, పండరక, దూదేకుల రహీం, వలీ, ఆటో బాబు, సాకే నరేంద్ర, పరంధామ, దత్తా రా మాంజి, తిరుపాలు తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరని తోపుదుర్తి పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేసి పార్టీ పటిష్టతకు శ్రమించాలని పిలుపునిచ్చారు. సహకార ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు అండగా ఉండి గెలిపించుకోవాలని మండల నాయకులు, కార్యకర్తలను కోరారు. రైతు సంక్షేమం కోసం మహానేత వైఎస్సార్ అమలు చేసిన పథకాలను రైతుల ఇళ్లకు వెళ్లి వివరించాలన్నారు.
నడింపల్లిలో: నడింపల్లి పంచాయతీలోని మూడు గ్రామాలకు చెందిన 200 కుటుంబాలు జిల్లా మైనారిటీ సెల్ కన్వీనర్ కేఎస్‌ఎస్‌బీ నూర్‌బాబా ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు మంగమ్మ, రాప్తాడు నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో పోలేపల్లి, పెద్దబాబయ్యపల్లి, నడింపల్లిలోని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు.
బుక్కరాయసముద్రంలో: మండలంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 200 మంది పార్టీలో చేరారు. టీడీపీలో కీలకంగా పని చేస్తూ మూడుసార్లు వరుసగా సింగిల్ విండో అధ్యక్షుడిగా కొనసాగిన బొమ్మలాటపల్లి సంజీవరెడ్డి పార్టీలో చేరారు. బొమ్మలాటపల్లిలో కన్వీనర్ సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథి పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, జిల్లా నాయకుడు ఎర్రిస్వామిరెడ్డి సమక్షంలో సంజీవరెడ్డితో పాటు 200 మంది చేరారు.

Back to Top