<br/>జగన్ సీఎం అయితేనే ఏపీకి మంచి రోజులు..రాజాం వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు..<br/><strong>శ్రీకాకుళంః</strong>రాజాం నగర పంచాయతీలో సమస్యలతో సతమతమవుతుందని వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు అన్నారు.ప్రజల కష్టాలను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.సమస్యలు వైయస్ జగన్‌ను దృష్టికి తీసుకెళ్ళాడానికి ఆయన ఎప్పుడు వస్తారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. రాజాం మెయిన్‌రోడ్డు రివైడింగ్‌కు శంకుస్థాపన చేసి సంవత్సర కాలం పూర్తయిందన్నారు.డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉందన్నారు.గవర్నమెంట్ ఆసుప్రతి కూడా దారుణంగా ఉందన్నారు.జగన్ సీఎం అయితే తప్ప సమస్యలు తీరవని రాజాం ప్రజలు భావిస్తున్నారన్నారు.తాగునీరు అందక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారన్నారు.కుళాయిలు ఇస్తామని చెప్పి టీడీపీ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. రాజాం పట్టణంలో ట్రాఫిక్ సమస్య కూడా చాలా ఎక్కువగా ఉందన్నారు.జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కువగా ఉన్నారని, వారికి న్యాయం జరగలేదన్నారు. వైయస్ జగన్ పాదయాత్రకు ప్రజలు సునామీలా పొటెత్తుతున్నారన్నారు.