<strong>తుక్కుగూడ (రంగారెడ్డి జిల్లా),</strong> 13 డిసెంబర్ 2012: శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 57వ రోజు గురువారంనాడు రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ నుంచి ప్రారంభమైంది. వేలాది అభిమానులు వెంటరాగా ఆమె ముందుకు కదిలారు. అక్కడి నుంచి శ్రీమతి షర్మిల రావిరాల చేరుకుంటారు. రావిరాలలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత ఆదిభట్ల చేరుకుంటారు. అనంతరం నాదర్‌గుల్ వరకూ నడిచి అక్కడ రచ్చబండ నిర్వహిస్తారు. రాత్రికి నాదర్‌గుల్‌లో బస చేస్తారు. <br/>ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి వత్తాసు పలుకుతున్న చంద్రబాబు నాయుడి తీరుకు నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. శ్రీమతి షర్మిల గురువారం 16 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు.<br/><br/>