టీఎస్ వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం..!

హైదరాబాద్ః  వరంగల్ లోక్ సభ ఉపఎన్నికకు సంబంధించి.. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలో తెలంగాణ వైఎస్సార్సీపీ నేతల విస్తృతస్థాయి సమావేశం జరగింది.  అభ్యర్థిత్వంతో పాటు పలు అంశాలపై నేతలు  సుదీర్ఘంగా చర్చించారు. ఈసమావేశానికి తెలంగాణ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్రనేతలు హాజరయ్యారు. 

దివంగత ముఖ్యమంత్రి ప్రియతమ నేత వైఎస్ . రాజశేఖర్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే వైఎస్సార్సీపీ గెలుపుకు కృషిచేస్తాయని వైఎస్సార్సీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే మళ్లీ రాజన్న రాజ్యం రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఈక్రమంలోనే ఇటీవల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన పరామర్శయాత్రకు వరంగల్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు .

Back to Top