కష్టాలు క‌నిపించ‌టం లేదా..!

రాష్ట్రంలో భ‌గ్గుమంటున్న ధ‌ర‌లు
సామాన్యుడి ఆవేద‌న ప‌ట్ట‌దా..!
అసెంబ్లీలో ప్ర‌స్తావించిన వైఎస్సార్‌సీపీ

హైద‌రాబాద్: రాష్ట్రంలో నిత్యావ‌స‌ర ధ‌రాలు షాక్ కొడుతున్నా ప‌ట్టించుకొనే ప‌రిస్థితి క‌నిపించ‌టం లేదు. సామాన్యుడ్ని గాలికి వ‌దిలేసిన ప్ర‌భుత్వం సింగ‌పూర్ కంపెనీల చుట్టూ తిరుగుతోంది.

భ‌గ్గుమంటున్న ధ‌ర‌లు
నిత్యావ‌స‌ర వ‌స్తువులు అయిన బియ్యం, పప్పులు, ఉప్పు, నూనె వంటి దినుసుల ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిపోయాయి. వ‌స్తువుల అవ‌స‌రాలు పెరిగిపోతున్నాఅడ్డుక‌ట్ట వేసేందుకు చ‌ర్య‌లు క‌నిపించ‌టం లేదు. దీంతో బ‌తుకులు క‌ష్టంగా మారుతున్నాయి.

షాక్ కొడుతున్న ధ‌ర‌లు
సామాన్యుడి క‌ష్టాల్ని త‌న‌విగా భావిస్తున్న వైఎస్సార్‌సీపీ ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్ర‌స్తావించింది.  దీని మీద చ‌ర్చించేందుకు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది. 344వ నిబంధ‌న కింద నోటీసు ఇచ్చిన‌ట్లు ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెల్ల‌డించారు. ధ‌ర‌ల పెరుగుద‌ల మీద చ‌ర్చించాల‌ని కోరారు. చ‌ర్చ‌కు ఎప్పుడు స‌మ‌యం ఇస్తామ‌న్నారో చెప్పాల‌ని కోరారు.

ప్ర‌భుత్వం నుంచి స్పంద‌న క‌ర‌వు
నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల పెరుగుద‌ల మీద చర్చించాల‌ని ఎన్ని సార్లు కోరినా ప్ర‌భుత్వం నుంచి స్పంద‌న క‌ర‌వైంది. త‌ర్వాత చ‌ర్చిద్దామ‌న్నారు త‌ప్పితే, స్ప‌ష్టంగా ఎప్పుడు అనేది కూడా హామీ ఇవ్వ‌లేదు. వాయిదా తీర్మానాన్ని స్పీక‌ర్ తోసిపుచ్చ‌టం జ‌రిగింది.
Back to Top