ఆయన సేవలు స్మరణీయం


హైదరాబాద్) అమర జీవి పొట్టి శ్రీరాములు సేవల్ని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ
అధ్యక్షులు వైఎస్ జగన్ స్మరించుకొన్నారు. అమరజీవి జయంతి సందర్భంగా పార్టీ తరపున
అంజలి అర్పించే కార్యక్రమం ఏర్పాటు అయింది. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి వైఎస్
జగన్ పుష్ప మాల వేసి నివాళులు అర్పించారు. ఆయన తో పాటు ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సుజయ్ క్రిష్ణ
రంగారావు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Back to Top