శనివారం నాటి యాత్ర 14.4కిమీ

శంఖవరం, 22 2013:

తూర్పు గోదావరి జిల్లాలో శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర  శనివారం (187వ రోజు) నాటి  వివరాలను సమన్వయకర్త తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి తెలియచేశారు. శంఖవరం మండలం బంగారయ్యపేట సమీపంలోని రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి శనివారం ఉదయం శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారు. ములగపూడి సమీపంలో మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. రాజవరం వరకూ పాదయాత్ర కొనసాగిస్తారు. అక్కడికి సమీపంలో రాత్రి బస చేస్తారు. శనివారం మొత్తం 14.4 కిలోమీటర్ల మేర శ్రీమతి షర్మిల పాదయాత్ర సాగుతుంది.

Back to Top