నేడు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిని క‌లువ‌నున్న వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు


అమ‌రావ‌తి:  ఓట్ల తొల‌గింపుపై ఫిర్యాదు చేసేందుకు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు గురువారం రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి ఆర్‌పీ సిసోడియాను క‌లువ‌నున్నారు. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షానికి చెందిన ఓట్ల‌ను భారీగా తొల‌గించ‌డంతో ఈ విష‌యాన్ని ఎన్నిక‌ల అధికారి దృష్టికి తీసుకెళ్ల‌నున్నారు. ఈ రోజు  ఉదయం 11.30 గంటలకు సెక్రటేరియట్ లోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి  సిసోడియా ను వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాస్ లు కలసి ఓటర్ల జాబితా లో అక్రమాలపై ఫిర్యాదు చేస్తారు. 

ఓ వైపు ఓటర్ల నమోదుపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. కొత్తగా ఓటర్ల చేర్పింపు ప్రక్రియ జోరుగా చేపడుతున్నారు. కానీ మరోవైపు చాపకింద నీరులా పాతవాటి తొలగింపు ప్రక్రియ కూడా అంతే జోరుగా సాగుతోంది. తాజా పరిస్థితులు ఓటర్లను ఒకింత ఆందోళన కలిగిస్తున్నాయి. నిరంతరం జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో కాపలా కాసుకోవడానికీ సమయం కేటాయించాల్సి రావడం ఇబ్బందికరంగా మారుతోంది. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 2014 ఎన్నికలతో పోల్చి చూస్తే వేలాది ఓట్లు తగ్గిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చేర్పులు ఓ వైపు సాగుతుండగా ఇంతగా తగ్గుతున్నాయంటే దీనివెనుక అసలు కారణాలేమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ఓట్లు చాలా కీలకం. భారతీయ పౌరుడై 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలి. అర్హులకు ఓటుహక్కు లేకపోతే, వారే ఓటువినియోగించుకోకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇం తటి కీలకమైన ఓటర్ల విషయంలో ఏమాత్రం తప్పు జరిగినా మెజార్టీ ప్రజల అభిప్రా యం ప్రతిబింబించదు. అంతేకాదు సరైన పాలకులు చట్టసభలకు ఎన్నికయ్యే అవకా శం ఉండదు. కానీ రాష్ట్రంలో అనేక మంది ఓట్లు జాబితా నుంచి ఆదృశ్యమవుతున్నాయి. ఇదే విష‌యాన్ని ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి దృష్టికి తీసుకెళ్ల‌నున్నారు.
Back to Top