నేడు కో-ఆర్డినేటర్ల రాష్ట్ర సమావేశం


 
- బీచ్‌రోడ్‌లోని విశాఖ ఫంక్షన్‌ హాలులో ఉదయం 10 గంటలకు ప్రారంభం 
విశాఖపట్నం: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి 260వ రోజు పాదయాత్ర మంగళవారం విశాఖ తూర్పు నియోజకవర్గంలో సాగుతోంది.  ఇవాళ‌ ఉదయం ఏడున్నర గంటలకు చినవాల్తేరు కనకమ్మ ఆలయం సమీపంలో రాత్రి బస శిబిరం నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర చినవాల్తేరు, ఈస్ట్‌ పాయింట్‌ కాలనీ, బీచ్‌రోడ్డు మీదుగా విశాఖ ఫంక్షన్‌ హాలు వరకు సాగనుంది. ఉదయం 10 గంటలకు విశాఖ ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ల సమావేశంలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గోనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 25 పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, కో ఆర్డినేటర్లు, 175 అసెంబ్లీ కో ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు పాల్గొంటారు.


తాజా ఫోటోలు

Back to Top