జనప్రభంజనం

- విశాఖ జిల్లాలో విజ‌య‌వంతంగా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
- అనకాపల్లిలో నేడు బహిరంగ సభ
 
 

విశాఖపట్నం: ప్రజా సమస్యల కోసం నిరంతరం అధ్యయనం చేస్తూ.. అలుపెరగని పాదయాత్రగా త‌మ ప్రాంతానికి వ‌చ్చిన వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి విశాఖ జిల్లా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. పాద‌యాత్ర దారుల‌న్నీ జ‌నంతో కిక్కిరిసిపోతున్నాయి. జ‌న‌నేత జగనన్న రాకతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకుంటోంది. ఎటు చూసినా జనసంబరమే..రాజన్న రాజ్యం రావాలి..రాక్షస పాలన పోవాలంటూ ఘోషిస్తోం ది జనప్రభంజనం. అలుపెరగని యోధునికి  అపూర్వ స్వాగతం పలుకుతోంది. కదం తొక్కు తూ.. పదం పాడుతూ పదండి పోదాం పైౖపైకీ అన్న ట్టుగా దూసుకెళ్తోంది ప్రజా సంకల్పయాత్ర.  

నాలుగున్నరేళ్ల నరాకాసురుని పాలనలో పడుతున్న కష్టాలను ఏకరవు పెట్టడమే కాదు..ఈ ప్రభుత్వం సాగిస్తున్న దౌర్జన్యాలు..దుర్మార్గాలను ప్రజలు కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నారు ప్రజలు. ప్రజాకంటక పాలన తుదముట్టించే లక్ష్యంతో వైయ‌స్ జ‌గ‌న్‌ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర బుధ‌వారం 249వ రోజు  అనకాపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. ఇవాళ ఉద‌యం మునగపాక మండలం తిమ్మరాజుపేట శివారు నుంచి పాదయాత్ర ప్రారంభ‌మైంది. అక్కడ నుంచి మండల కేంద్రమైన మునగపాక, గంగాదేవిపేట క్రాస్, ఒంపోలు, అనకాపల్లి మెయిన్‌ రోడ్డు, ఉమ్మలాడ క్రాస్‌ రోడ్డు, పూల్‌బాగ్‌రోడ్డు జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్‌ మీదుగా నెహ్రూచౌక్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు అన‌కాప‌ల్లి టౌన్‌లో ఏర్పాటు చేసిన‌ బహిరంగసభలో వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రసంగించ‌నున్నారు.  
 
Back to Top