తిరుగులేని శక్తిగా వైయస్ఆర్ కాంగ్రెస్

మధిర:

వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి జైలులో నిర్బం ధించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు. అతి తక్కువ సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని జిల్లాలో తిరుగులేని శక్తిగా చేశామన్నారు. గ్రామగ్రామాన పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయని, పార్టీని ప్రజల మధ్యకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు. పార్టీ ఆవిర్భవించిన అనతికాలంలోనే 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్, 30 ఏళ్ల టీడీపీ, శతాబ్దాల చరిత్ర కలిగిన వామపక్షాలకు దీటుగా ఎదిగిందని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ కుట్ర పన్ని తమ పార్టీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నాయని చెప్పారు. దివంగత మహానేత వైయస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగన్ సీఎం కావాల్సిందేనన్నారు.

Back to Top