దారి పొడవునా వినతులు.. అన్ని సమస్యలే..


బాబును నమ్మిమోసపోయాం.. నడిరోడ్డున పడ్డాం
పాదయాత్రలో వైయస్‌ జగన్‌ను కలుస్తున్న వివిధ వర్గాల ప్రజలు


విజయనగరం: పాదయాత్రగా వస్తున్న వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకోవాలని ఊర్లకు ఊర్లే కదిలొస్తున్నాయి. తమ సమస్యలు తీర్చే నాయకుడు, బతుకుల్లో వెలుగులు నింపే నేత కోసం ప్రజలంతా ప్రజా సంకల్పయాత్రకు ఉప్పెనలా తరలివస్తున్నారు. పాదయాత్ర సాగే దారంతా జనగోదారిలా నిండుతోంది. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమంటూ యువత, మహిళలు, రైతులు, నిరుద్యోగులు ఆయన అడుగులో అడుగు వేస్తున్నారు. తమ గ్రామంలో నెలకొన్న సమస్యలను జననేత దృష్టికి తీసుకువస్తున్నారు. విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న 280వ రోజు ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు కలిశారు. విశ్వ బ్రాహ్మణుల్లో కార్పెంటర్లు, శిల్పం, కంచర, కమ్మర ఉపకులాలు ఉన్నాయని, స్వర్ణకారులకు హామీ ఇచ్చినట్లే తమను ఆదుకోవాలని వినతిపత్రం అందజేశారు. కార్పెంటర్లకు ప్రభుత్వ టింబర్‌ డిపోల నుంచి సబ్సిడీతో కలప సరఫరా చేయాలని వైయస్‌ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. 

టీడీపీని నమ్మి మోసపోయాం..

టీడీపీ నేతల మాటలన్నీ నీటిమీద మూటలేనని, వారిని నమ్మి మోసపోయామని తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్టు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో వైయస్‌ జగన్‌ను నిర్వాసితులు కలిశారు. 1400 ఎకరాల పంట భూమిని సేకరించి ప్రభుత్వం పరిహారం ఇప్పటికీ ఇవ్వలేదని వాపోయారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు తమ గ్రామాన్ని దత్తత తీసుకొని పరిహారం ఇప్పిస్తానని నమ్మబలికి ఇప్పటికీ అందించలేదని సారిపల్లి గ్రామస్తులు ఆందోళన చెందారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టు ప్రారంభమైందని, వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు రోడ్డున పడేసిన తమ బతుకులను అన్న వచ్చి బాగు చేస్తాడన్నారు. 
 
Back to Top