తెనాలి, మంగళగిరిలలో నేడు షర్మిల పాదయాత్ర

గుంటూరు, 21 మార్చి 2013: మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, జననేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 97వ రోజు గురువారం తెనాలి, మంగళగిరి నియోజకవర్గాల్లో సాగుతుంది.  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖ‌ర్, పార్టీ ‌కార్యక్రమాల రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురా‌మ్‌ ఈ విషయం తెలిపారు.

తెనాలిలో బుధవారం రాత్రికి బసచేసిన ప్రాంతం నుంచి గురువారం ఉదయం శ్రీమతి షర్మిల పాదయాత్రగా బయలుదేరారు. అక్కడి నుంచి ఐతానగర్, బస్‌‌స్టాండ్, కఠివరం క్రా‌స్‌రోడ్, ఆటోనగ‌ర్ మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. ‌అనంతరం నందివెలుగు, చింతలపూడి మీదుగా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మీదుగా శ్రీమతి షర్మిల రాత్రి బసకు చేరుకుంటారని వారు వివరించారు. కాగా షర్మిల పాదయాత్రలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, వైయస్‌ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో తరలి వచ్చి శ్రీమతి షర్మిలకు సంఘీభావం తెలుపుతున్నారు. శ్రీమతి షర్మిల ఈ రోజు మొత్తం 14.2 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు.
Back to Top