తెలుగు ప్రజల గొంతు మరోసారి నొక్కారు


ఆర్డర్‌లో లేదంటూ లోక్‌సభ వాయిదా వేసిన స్పీకర్‌
నిరసనగా ఉగాది విందు బహిష్కరిస్తున్నాం


ఢిల్లీ: లోక్‌సభలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల గొంతు నొక్కే కార్యక్రమం చేసిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. లోక్‌సభ వాయిదా అనంతరం ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్థిక బిల్లు పాస్‌ చేసినప్పుడు సభ ఆర్డర్‌లో ఉందా.. మీ అవసరాలకు సభ గందరగోళంలో ఉన్నా నడుపుతారు.. దేశ వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటాలు చేస్తుంటే ముందుకు ఎందుకు రావడం లేదని ఎన్డీయే ప్రభుత్వాన్ని, స్పీకర్‌ను ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం స్పీకర్‌ చదివి వినిపించే సమయంలో వంద మందికి పైగా సభ్యులు మద్దతుగా నిలబడ్డారన్నారు. అయినా ఆర్డర్‌లో లేదంటూ స్పీకర్‌ వాయిదా వేశారన్నారు. దీనికి నిరసనగా ఉగాది సందర్భంగా పార్లమెంట్‌ సభ్యులందరికీ స్పీకర్‌ ఇచ్చే లంచ్‌ (గుడ్‌పడవా)కు హాజరవ్వడం లేదన్నారు. 
చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ముందే ఎందుకు అవిశ్వాసం పెట్టలేదని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ఎన్డీయేలో కొనసాగుతూ.. హోదాను నీరుగార్చి ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అవిశ్వాసం
Back to Top