తెలంగాణ వైయ‌స్ఆర్‌సీపీ ముఖ్య సమావేశం ప్రారంభంహైదరాబాద్‌: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ముఖ్య సమావేశం కొద్దిసేప‌టి క్రిత‌మే ప్రారంభ‌మైంది. హైద‌ర‌బాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన స‌మావేశం ప్రారంభ‌మైంది. సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షులు, ఎస్‌ఈసీ సభ్యులు, అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు హాజర‌య్యారు. సమావేశంలో రాబోయే ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, తదితర అంశాలపై చర్చిస్తున్నారు.
Back to Top