టీడీపీ ప్రజల విశ్వాసం కోల్పోయింది

పామర్రు (కృష్ణా జిల్లా): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 'వస్తున్న.. మీ కోసం' అంటూ చేపట్టిన పాదయాత్రలో ఇచ్చే హామీలు, చెప్పే మాటలు నమ్మే స్థితిలో రాష్ర్ట ప్రజలు లేరని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన అన్నారు. ప్రజల విశ్వాసాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడో కోల్పోయిందని ఆమె దుయ్యబట్టారు.  ఆ పార్టీలో ఉంటే ప్రజలకు సేవ చేయలేననే ఉద్దేశంతోనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కల్పన చెప్పారు. రాష్ర్టంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రజాదరణ  అనేక సందర్భాల్లో రుజువైందన్నారు. రాష్ర్ట ప్రజలకు అత్యంత విశ్వసనీయత గల నాయకుడైనందుకే వైయస్ జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలులో పెట్టించారని కల్పన ఆరోపించారు.

Back to Top