నిందితుడిపై కేసులున్నా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్..వైయస్ జగన్ హత్యాయత్నంలో కుట్రకోణం వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి
ఢిల్లీః వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని అంతం చేయాలనే టార్గెట్‌తోనే హత్యాయత్నం జరిగిందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. కుట్రలో భాగంగానే విచారణను కూడా పక్కదారి పట్టించడానికి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. కోడి కత్తి మెడకు తగిలితే వైయస్ జగన్ ప్రాణాలు పోయేవని రిమాండ్ రిపోర్ట్ కూడా స్పష్టం చేసిందన్నారు. నిందితుడు శ్రీనివాస్‌పై గతంలో కేసులు ఉన్నా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. దీనివెనుక టీడీపీ పెద్దలు ఉన్నారన్నారు. గతంలో కూడా నిందితుడు సంచలన వార్తలు రాబోతున్నట్లుగా తన స్నేహితులతో చెప్పాడనే వార్తలు వచ్చాయన్నారు. అదేవిధంగా చంద్రబాబు, డీజీపీ కలిసి ప్రచార్భాటం, సానుభూతి అంటూ మాట్లాడటం వెనుక కూడా కుట్రకోణం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. టీడీపీ మంత్రులు అచ్చెంన్నాయుడు, సోమిరెడ్డి తదితరులు జగన్‌పై హత్యాయత్నం జరిగిన వెంటనే ఒక ప్రణాళిక ప్రకారం బురదచల్లే చర్యలకు దిగి ప్రజలను నమ్మించే విధంగా ప్రచారం చేయడం వెనుక మరింత అనుమానాలు బలపడుతున్నాయన్నారు.