టీడీపీ గల్లంతవుతుందనే బాబు యాత్ర: అంబటి

పిడుగురాళ్ళ:

ఓదార్పు యాత్రతో జగన్ ప్రజాభిమానం చూరగొన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడ టీడీపీ గల్లంతవుతుందోనన్న భయంతోనే చంద్రబాబు పాదయాత్ర చేపట్టారని వైయస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. పిడుగురాళ్ల పట్టణంలోని ఏడుకొట్ల సెంటర్‌లో గడప గడపకూ వైయస్ఆర్  కాంగ్రెస్ ముగింపు బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సభకు పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. అంబటి మాట్లాడుతూ తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, మరో తొమ్మిదేళ్లుగా ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న చంద్రబాబుకు ఏనాడూ ప్రజా సంక్షేమం పట్టలేదని చెప్పారు. బాబు కల్లబొల్లి మాటలను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు.

షర్మిల యాత్ర ప్రకటనతో కాంగ్రెస్, టీడీపీల్లో గుబులు
వైయస్ కుమార్తె షర్మిల 18వ తేదీన చేపట్టనున్న పాదయాత్ర టీడీపీ, కాంగ్రెస్ గుండెల్లో గుబులు పుట్టిస్తోందన్నారు. పాదయాత్ర ముగింపు అనంతరం రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు గల్లంతవుతాయని చెప్పారు. జగన్‌ను జైల్లో ఉంచి చంద్రబాబు పాదయాత్ర చేపడితే, సీఎం కిరణ్ ఇందిరమ్మ బాట పట్టారన్నారు. జగన్ జైల్లో ఉన్నా, బయట ఉన్నా రాష్ట్ర ప్రజానీకం ఆయన వెంటే నడుస్తుందని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు కంకణంకట్టుకున్నారని చెప్పారు. షర్మిలమ్మ మరో ప్రస్థానం పాదయాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సభలో పార్టీ నరసరావుపేట నియోజకవర్గ నాయకుడు గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్టీ, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే గుదిబండ వెంకటరెడ్డి, శివరామకృష్ణారెడ్డి, నాయకులు కావటి మనోహర్‌నాయుడు, చిట్టా విజయభాస్కర్‌రెడ్డి, ఆతుకూరి ఆంజనేయులు, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, కొత్తమాసు వెంకటేశ్వర్లు, లాకా వెంగళరావుయాదవ్, నూతలపాటి హనుమయ్య, పార్టీ మండల కన్వీనర్ చల్లా పిచ్చిరెడ్డి, బోయ శ్రీనివాస్‌రెడ్డి, కర్రా చినకోటేశ్వరరావు, వుగ్గు నాగేశ్వరరావు, కత్తెరపు వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top