హోదాపై చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేయాలి

చిత్తూరు: ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్‌ చేశారు. నాలుగేళ్లుగా బీజేపీతో అంటకాగి ప్రజలను మోసం చేశాడన్నారు. బాబు లాంటి గజదొంగ మరెక్కడా ఉండరన్నారు. చిత్తూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం బాగుపడుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ ఒక్కరే పోరాడుతున్నారన్నారు. నాలుగు సంవత్సరాలుగా హోదా ఉద్యమాన్ని సాగిస్తూ ఉధృతం చేశారన్నారు. ఏప్రిల్‌ 6వ తేదీన ఎంపీలతో రాజీనామాలు కూడా చేయించనున్నట్లు చెప్పారు. వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీల పోరాటానికి ప్రజలంతా సంఘీభావం తెలపాలని కోరారు. 


తాజా వీడియోలు

Back to Top