టీడీపీ మైనార్టీ నాయకులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక

గుంటూరు:  టీడీపీ మైనార్టీ నాయ‌కులు వంద మంది వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాచ‌ర్ల‌ తూర్పుబావి ప్రాంతంలో బుధవారం రాత్రి ముస్లిం మైనార్టీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా మైనార్టీ యువజన సంఘ నాయకుడు పఠాన్‌ బాబూఖాన్‌ ఆధ్వర్యంలో 100 మంది కార్యకర్తలు పార్టీ విప్‌ పీఆర్కే ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన పఠాన్‌ఖాన్, పూలకొట్టు ఇమ్రాన్, మెకానిక్‌ అక్బర్, షేక్‌ ఫయాజ్, ఎస్‌కే బాషా, ముస్తఫా, నాసిర్‌‡, జానీ, అజీజ్‌లతో పాటు మరో 90 మందికి పైగా కార్యకర్తలు టీడీపీ నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరందరినీ పీఆర్కే సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్‌ను ఆయన కట్‌ చేశారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు గంగిజాన్, మాయ సుబానీ, ట్రాక్టర్‌ కరిముల్లా, షేక్‌ కరిముల్లా, ఉప్పలపాడు జానీ, సంషీర్, ఆకుల శ్రీనివాస్‌నాయుడు, మట్టా శ్రీనుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Back to Top