చేతగాని దద్దమ్మ మంత్రులు

  • ఖజానా నిండాలా.. ఎవరి ఖజానా నిండాలయ్యా..?
  • బుద్ధి లేకుండా మాట్లాడుతున్న సోదిరెడ్డి, సొల్లు దేవినేని
  • వైయస్ జగన్ పై నోరు పారేసుకుంటే నోళ్లు కుట్టేస్తాం
  • దోచుకుంది దాచుకోవడానికే బాబు విదేశీ పర్యటన
  • వైయస్‌ జగన్‌పై చేసిన ఆరోపణలు నిరూపించాలని టీడీపీకి జోగి రమేష్ సవాల్
విజయవాడ: నోరు ఉందికదా అని ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌పై టీడీపీ మంత్రులు నోరు పారేసుకుంటే నోళ్లు కుట్టేస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ హెచ్చరించారు. మ్యానిఫెస్టోలో పెట్టిన హామీని నెరవేర్చాలని వైయస్‌ జగన్‌ కోరితే.. టీడీపీ మంత్రులు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జోగి రమేష్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా... ప్రధాన ప్రతిపక్షనేత నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరితే.. ఖజానా నిండిన తరువాత ఇస్తామని అనడం సిగ్గుచేటు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఖజానా నిండాలంటే ఎన్ని లక్షల కోట్లు అయినా సరిపోదన్నారు. మీ ఖజానా నిండితేనే నిరుద్యోగులకు భృతి ఇస్తామనడానికి మంత్రి కాల్వ శ్రీనివాసులుకు సిగ్గుందా అని ప్రశ్నించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో నిరుద్యోగులకు భృతి కల్పిస్తామన్నారు. మూడు సంవత్సరాలు గడిచింది. నిరుద్యోగులకు భృతి కల్పించండయ్యా.. అని అడిగితే ఆయనపై నిందలు వేసే కార్యక్రమం చేస్తున్నారు. ఖజానా నిండాలన్నప్పుడు మ్యానిఫెస్టోలో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. కనీస అక్షరజ్ఞానం లేని మంత్రి సోమిరెడ్డి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని జోగి రమేష్‌ ధ్వజమెత్తారు. సోమిరెడ్డి మంత్రిగా కంటే సోదిచెప్పుకోవడానికి బాగా పనికొస్తాడని ఎద్దేవా చేశారు. మీకు దమ్మూ, ధైర్యం ఉంటే సోదిరెడ్డి, సొల్లు దేవినేని ఉమాలు వైయస్‌ జగన్‌పై చేసిన ఆరోపణలు రుజువు చేయాలన్నారు. చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేయడానికి ప్రెస్‌మీట్‌లు పెట్టి నిందలు వేస్తారా అని విరుచుకుపడ్డారు. నియోజకవర్గానికి తాగునీరు అందించలేని  దద్దమ్మ మంత్రి దేవినేని సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడన్నారు. 

దమ్ముంటే కనకదుర్గ గుడిలో ప్రమాణం చేద్దామా
సీఎం చంద్రబాబు దౌర్భాగ్య పాలనలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఆస్తులు, బంగారం అమ్ముకునే పరిస్థితి దాపురించిందని జోగి రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల దృష్టి మళ్లించడానికే చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్లారన్నారు. వైయస్‌ జగన్‌పై చేసిన ఆరపణలు మీరు నిరూపించకపోతే విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా తెలుగుదేశం ప్రభుత్వానికి, నాయకులకు శిక్షపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. రుణమాఫీ చేయమని అడిగితే.. ఆర్బీఐ గవర్నర్‌కు వైయస్‌ జగన్‌ లేఖ రాశారంటారా.. ఆర్బీఐ గవర్నర్‌ ఎవరి పరిధిలో ఉంటారో కనీసం తెలియదా మీకు అని ప్రభుత్వానికి చురకంటించారు. నోరుందికదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని మరోమారు హెచ్చరించారు. చంద్రబాబు అమెరికా పర్యటనలో ఏదో అంతర్యం ఉందని జోగి రమేష్‌ అనుమానం వ్యక్తం చేశారు. పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్లారా.. లేక విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారా అని టీడీపీ నేతలను నిలదీశారు. మూడు సంవత్సరాలుగా ఎన్నిసార్లు విదేశీ పర్యటన చేశావ్‌. ఎన్ని పెట్టబడులు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావని చంద్రబాబును ప్రశ్నించారు. విదేశీ పర్యటనల వల్ల నీకు, నీ కోటరీకి అయిన ఖర్చు ఎంతా.? నువ్వు విదేశాల నుంచి తీసుకొచ్చిందెంతా అనేది మీడియా ముందు ఉంచాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబు పర్యటనపై అమెరికా అధికారులకు ఈమెయిల్స్‌ పంపించారడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గుమ్మడికాయ దొంగలెవరంటే భుజాలు తడుముకున్నట్లుగా టీడీపీ నేతల వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. మీకు దమ్ముంటే వైయస్‌ జగన్‌పై చేసిన ఆరోపణలకు కనకదుర్గ సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమా అని చాలెంజ్‌ విసిరారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top