వైయ‌స్ఆర్‌సీపీలోకి ఊపందుకున్న వ‌ల‌స‌లు

అనంత‌పురం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. ప్ర‌తి రోజూ ఎక్క‌డో ఓ చోట అధికార పార్టీ నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజల సమస్యల కోసం నిరంతర పోరాటం చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు రోజు రోజుకు మ‌ద్ద‌తుగా పెరుగుతోంది. అనంతపురం అర్భన్ నియోజవర్గ టీడీపీ నేత లింగాల రమేష్ సహా 200 మంది కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. నియోజకవర్గ వైయ‌స్ఆర్‌ సీపీ సమన్వయకర్త నదీం అహ్మద్  టీడీపీ నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఉద్యమాలకు ఆకర్షితులమయ్యామని, ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు కాపాడలేకపోయినందుకే పార్టీని వీడుతున్నట్టు లింగాల రమేష్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా ఇటీవలే గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ నిమ్మకాయల ఆదినారాయణ, సత్తెనపల్లి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆతుకూరి నాగేశ్వరరావులు వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. అదే విధంగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన టీడీపీ సీనియర్ నేత జ్యోతుల చంటిబాబు, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల‌కు చెందిన ప్ర‌ముఖ వైద్యులు వైయ‌స్ఆర్‌ సీపీలో చేరిన విషయం తెలిసిందే. 

తాజా వీడియోలు

Back to Top