టీడీపీ నేత‌లు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌క‌ర్నూలు:  క‌ర్నూలు జిల్లాలో  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు ప్రారంభ‌మ‌య్యాయి.  మ‌ంత్రి భూమా అఖిల ప్రియ‌కు ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద దెబ్బ త‌గిలింది. టీడీపీకి చెందిన కీల‌క నేత‌లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. నియోజ‌క‌వ‌ర్గంలోని శిరివెళ్ల మండ‌లానికి చెందిన టీడీపీ నాయ‌కులు ఎమ్మెల్సీ గంగుల ప్ర‌భాక‌ర్‌రెడ్డి నేతృత్వంలో వైయ‌స్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి గంగుల ప్ర‌భాక‌ర్‌రెడ్డి పార్టీ కండువాలు క‌ప్పి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా పార్టీలో చేరిన నాయ‌కులు మాట్లాడుతూ..వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల కోసం చేస్తున్న పోరాటాల‌కు ఆక‌ర్శితుల‌మై వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన‌ట్లు చెప్పారు. టీడీపీ నేత‌లు రోజుకో మాట మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నార‌న్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమ‌లు చేయ‌లేద‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. 
Back to Top