తెలుగు తమ్ముళ్ల పింఛన్ల దందా

శ్రీకాకుళం: టెక్కలి మండలం కోటబొమ్మాళిలో ఈ నెల 29 నుంచి జరగబోయే గ్రామదేవత పండగల కోసం... వృద్ధులకు ఇచ్చే పింఛన్లలో టీడీపీ నేతలు రూ.500 వసూలు చేయడం దారుణమని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రొక్కం సూర్యప్రకాశరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి అచ్చెన్నాయుడు మెప్పు కోసమే తెలుగు తమ్ముళ్లు ఈ వసూళ్లకు పాల్పడుతున్నారని  మండిపడ్డారు. ఈ విషయంపై అచ్చెన్నాయుడు  వెంటనే దృష్టి సారించాలని కోరారు. కలెక్టర్ కూడా పరిశీలన చేసి వసూళ్ల దందా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో వైయస్సార్‌సీపీ నేతలు శిమ్మ వెంకట్రావు, గుడ్ల మల్లేశ్వరరావు, ఎం.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top