ఎన్టీఆర్‌ పేరును భ్రష్టుపట్టిస్తున్న టీడీపీ నేతలు

విజయవాడ: ఎన్టీఆర్‌ వారసులమని చెప్పుకుంటూ నీచమైన పనులు చేస్తూ ఆయన పేరుప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న మంత్రి నారాయణను వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ హయాంలో మంత్రివర్గంలో అప్పటి విద్యాశాఖమంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు పేపర్‌ లీక్‌ అయితే నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ పేరు చెప్పుకుంటూ తిరుగుతూ అరాచకాలకు పాల్పడుతున్న మంతి నారాయణను భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. నారాయణ విద్యాసంస్థల్లో ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసకుంటున్నారు వాటిపై విచారణ చేపట్టాలన్నారు. పేపర్‌ లీక్‌లపై వైయస్‌ఆర్‌ సీపీ అసెంబ్లీలో వాయిదా తీర్మాణం ఇస్తే దాన్ని చర్చకు రానివ్వకుండా చేయడం దారుణమన్నారు. ప్రతిపక్ష పార్టీగా సభలో విద్యార్థుల భవిష్యత్తుపై చర్చించే బాధ్యత మాపై ఉందన్నారు. పేపర్‌ లీక్‌లపై సమగ్ర విచారణకు ఆదేశించి తల్లిదండ్రులకు పిల్లలకు న్యాయం జరిగే విధంగా చేయాలన్నారు.

Back to Top