టీడీపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి


ప్రకాశంః సంక్షేమ పథకాలు అన్నివర్గాలకు అందాలంటే కావాలి జగన్‌–రావాలి జగన్‌ అనాలని మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి అన్నారు. కందుకూరులో ఏకలవ్య నగర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. టీడీపీ అరాచక పాలనకు ఓటుతో బుద్ధిచెప్పి రాబోయే కాలంలో వైయస్‌ఆర్‌సీపీకి మద్దతు తెలపాలన్నారు. నిరంతరం ప్రజలకోసం శ్రమించే జననేత వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలన్నారు.
Back to Top