శ్రీకాకుళం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. జననేత ప్రకటించిన నవరత్నాల పథకాలతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలో వైయస్ఆర్‌సీపీలోకి వలసలు అధికమయ్యాయి. బుధవారం టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్‌లు యెన్ని జ్యోతి, మన్మధరావు, మాధవరావు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి వైయస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని, రాజన్న రాజ్యంతోనే అభివృద్ధిసాధ్యమని చెప్పారు. <br/><br/>