<strong>హైదరాబాద్:</strong> వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆదివారం చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో పర్యటించనున్నారు. తంబళపల్లె నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో ఆమె పాల్గొంటారని పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ తెలిపారు. టిడిపికి రాజీనామా చేసిన తంబళ్లపల్లె ఎమ్మెల్యే ఎ.వి.ప్రవీణ్‌కుమార్ రెడ్డి వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆదివారం బి.కొత్తకోటలో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు శ్రీమతి విజయమ్మ హాజరవుతారని అన్నారు.<br/>శ్రీమతి విజయమ్మ ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి బెంగళూరు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బి.కొత్తకోట వెళతారు. అక్కడ జిల్లా పరిషత్ హైస్కూలు మైదానంలో మధ్యాహ్నం 1.30కి జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మళ్లీ ఆమె రోడ్డు మార్గంలో బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి విమానంలో రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారని రఘురామ్ తెలిపారు.