'సువర్ణ పాలనను జననేత జగన్‌ అందిస్తారు'

శ్రీకాకుళం : రాష్ర్టంలో టిడిపి, కాంగ్రెస్ పార్టీలు‌ కొద్దిరోజుల్లోనే గల్లంతైపోతాయని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ ‌జోస్యం చెప్పారు. కోటబొమ్మాళి మండలం యలమంచిలిలోని టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆదివారం‌నాడు వైయస్‌ఆర్‌సిపిలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో దువ్వాడ మాట్లాడారు.

దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి అందించిన అద్భుత సంక్షేమ పాలనకు మించిన స్వర్ణయుగాన్ని శ్రీ జగన్మోహన్‌రెడ్డి అందిస్తారని శ్రీనివాస్‌ అన్నారు. మహానేత వైయస్‌ను గతంలో దేవుడని కొలిచిన నేటి కాంగ్రెస్ పెద్దలు, స్థానిక ‌నాయకులు ఇప్పుడు ఆయనను ముద్దాయిగా పేర్కొంటూ కుటిల నీతిని ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. అధికార కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతామంటూ ప్రజలు ఈ సభలో నినాదాలు చేశారు. జై జగన్ నినాదాలతో‌ సభా ప్రాంగణం ఒక్కసారిగా హోరెత్తింది. అనంతరం వందలాది మంది గ్రామస్థులు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ సభ్యత్వం తీసుకున్నారు. వారికి దువ్వాడ శ్రీనివాస్ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు.
Back to Top