విద్యార్థులే ఉద్యమించాలి

గుంటూరు: ప్రత్యేక హోదా సాధనకు రాజకీయ పార్టీలు కాదు..యువత, విద్యార్థులే ఉద్యమించాలని విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య పిలుపునిచ్చారు. గుంటూరు యువభేరిలో ఆయన మాట్లాడారు. ప్రజల పక్షాన నిలబడి, నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడుతున్న వైయస్‌ జగన్‌ ఒక్కరే. ప్రక్క రాష్ట్రాలు కూడా ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అంటున్నారు. మన ప్రభుత్వం మాత్రం వద్దంటుంది. ఇది విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే కేంద్రంతో బాగుండాలని వారు వెనుకడుగు వేస్తున్నారు. మేం ముందుండి పోరాడుతామని వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమిస్తుంటే అడ్డుపడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా లేదు. మనం చేయం, వేరే వాళ్లు చేస్తుంటే అడ్డుపడటం సరికాదు. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి. ఒక వైపు అమెరికా కూడా మనల్ని రానివ్వడం లేదు. మనకు పరిశ్రమలు వస్తేనే ఉపాధి దొరుకుతుంది. పారిశ్రామిక వేత్తలు రావాలంటే వారికి రాయితీలు ఇవ్వాలి. ఇలాగే కొనసాగితే మీ భవిష్యత్తు నాశనమవుతుంది. మీరే ఉద్యమించాలి. ఆత్మాభిమానం చాలా గొప్పగా ఉండాలి. మనం ఏదైనా కట్టడానికి సింగపూర్, జపాన్‌రావాలా? మనకు తెలివి లేదా?ఇదే పిల్లలు, మన దేశానికి చెందిన శాస్త్రవేత్తలు అంతరిక్ష ప్రయోగం చేసి చరిత్ర సృష్టించారు. ప్రత్యేక హోదా, ఆత్మాభిమానంతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అట్లా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీస్తు వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు.

Back to Top