బాబును నిల‌దీసిన విద్యార్థులు

* బాబు మోసం చేశార‌ని ఆగ్ర‌హం
* ఓట్లు అడ‌గానికి వ‌స్తే కాల‌ర్ ప‌ట్టుక‌ని అడుగుతాం
* హోదాతో ఉప‌యోగం లేన‌ప్పుడు ఉత్త‌రాఖాండ్‌లో ఎందుకు పెట్టుబ‌డులు పెడుతున్నారు?
విజ‌య‌న‌గ‌రం జ‌గ‌న్నాథ ఫంక్ష‌న్ హాల్‌లో నిర్వ‌హించిన యువ‌భేరి కార్య‌క్ర‌మంలో విద్యార్థులు చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. మోస‌పూరిత వాగ్ధానాలు ఇచ్చి ప్ర‌జ‌లును, విద్యార్థుల‌ను మోసం చేశార‌ని మండిప‌డ్డారు. బాబు పాల‌న‌ను పంపించే వ‌ర‌కు మేమూ మీతో  ఉంటాం అన్నా అంటూ విద్యార్థులు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో అన్నారు. ప్ర‌త్యేక హోదాకు సంబంధించి ప‌లు ప్ర‌శ్న‌లు వైయ‌స్ జ‌గ‌న్‌ను అడ‌గ్గా ఆయ‌న విద్యార్థుల ప్ర‌జ‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు. విద్యార్థులు అడిగిన ప్ర‌శ్న‌లు ఇలా ఉన్నాయి.  

ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అన్నా?
- హిమబిందు, బీటెక్‌ 
వైయస్‌ జగన్‌: చంద్రబాబు వచ్చీరాని ఇంగ్లీష్‌లో మాట్లాడితే పరిశ్రమలు రావు. ప్రత్యేక హోదా వల్లే పరిశ్రమలు వస్తాయి. బాబు సుందర ముఖారవిందాన్ని చూసి పెట్టుబడులు రావు. హోదా వస్తేనే వంద శాతం ఇన్‌కం ట్యాక్స్‌ మినహాయింపులు, ఇన్‌సెంటివ్స్‌ ఇస్తేనే పారిశ్రామిక వేత్తలు వస్తారు. బాబు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానాల్లో తిరిగితే పరిశ్రమలు రావు. కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తేనే ఆది సాధ్యం అవుతుంది. ఇది చంద్రబాబు పాలనలో వస్తుందన్న నమ్మకం లేదు. హోదా ఇస్తేనే మద్దతిస్తామని కేంద్రాన్ని హెచ్చరించాలి. ప్రత్యేక హోదా కోసం అందరం కలిసికట్టుగా పోరాడుదాం. దేవుని దయ వల్ల రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుంది. గట్టిగా పోరాడుదాం.
––––––––––––––
అందరికీ స్కాలర్‌షిప్‌లు వచ్చేలా చూడండి: ఫర్నాజ్, ఎంబీఏ
స్టూడెంట్స్‌ అందరూ బాగా చదవాలని వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచాక అర్థంపర్థం లేని నిబంధనలతో పథకాలను ఎలా తగ్గించాలా అని చూస్తున్నారు. ఆధార్‌ కార్డు, ఫింగర్‌ ప్రింట్‌ సరిగా లేదంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కోత విధించారు. దీనివల్ల చాలామంది పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. చాలా మందికి స్కాలర్‌షిప్‌ అందడం లేదు. మీరు సీఎం అయ్యాక మా అందరికీ స్కాలర్‌షిప్‌లు వచ్చేలా చూడండి.
వైయస్‌ జగన్‌:  మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పూర్తిగా విప్లవాత్మకంగా అమలు చేస్తాం. అన్ని యువభేరిల్లో ఇదే మాట చెబుతున్నాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తగ్గించేందుకు చంద్రబాబు లేనిపోని నిబంధనలు పెడుతున్నారు. మనసున్న ముఖ్యమంత్రి ఆస్థానంలో లేరు. ఒకవైపు కాలేజీ యాజమాన్యాలు ఫీజులు పెంచుతున్నారు. మరోవైపు చంద్రబాబు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఆమౌంట్‌కు పరిమితి విధిస్తున్నారు. ముష్టి వేసినట్లు రూ.30 వేలు ఇస్తున్నారు. తల్లిదండ్రులు లక్షల రూపాయలు కట్టాల్సి వస్తోంది. ఇందు కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారు. ఇదే పెద్దమనిషి చంద్రబాబు బీసీల మీద ప్రేమ ఉందంటారు. కత్తెర్లు ఇస్తే ప్రేమ తిరుతుందా? నిజంగా ఆ పిల్లలు, కుటుంబాలు పేదరికం నుంచి బయటపడాలంటే గతంలో నాన్నగారు చేసిన ఆలోచనలు చేయాలి. మనందరి ప్రభుత్వం వస్తుంది. అప్పుడు గొప్పగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలు చేస్తాం. 
–––––––
ఇక మోసపోవడానికి సిద్ధంగా లేం: శౌర్య, ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌
ప్రత్యేక హోదా సంజీవని కాదని టీడీపీ నాయకులు చెబుతున్నారు. సంజీవని కానప్పుడు టీడీపీ నేతలు సుజన చౌదరి, గల్ల జయదేవ్, సీఎం రమేష్, రామాంజనేయులు వంటి వారు పక్క రాష్ట్రాల్లో ఎందుకు పెట్టుబడులు పెడుతున్నారు. మన రాష్ట్రం పదవులకేనా? పెట్టుబడులకు పనిరాదా? . ఇంకా ఎన్నాళ్లు మమ్మల్ని మోసం చేస్తారు. మోసపోవడానికి ఎవరూ రెడీగా లేరు.  అడ్వాన్స్‌ హాపీ బర్త్‌డే అన్నా
వైయస్‌ జగన్‌:  రామాంజనేయులు, సుజన వీళ్లంతా కూడా టీడీపీ లో క్రీయశీలకంగా ఉన్నవారు ఉత్తరాఖండ్‌కు వెళ్లి పెట్టుబడులు పెట్టి సోదిమాటలు చెబుతున్నారు. 
–––––––––
బాబు మంచులా కరిగిపోయారు: సూర్య, డిగ్రీ సెకెండ్‌ ఇయర్‌
చంద్రబాబు హోదా విషయంలో రాజీ పడేది లేదని చెప్పారు. హోదా విషయంలో కేంద్రం తీరుపై రక్తం మరిగిపోతుందని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అరుణ్‌జైట్లీ ప్యాకేజీ ప్రకటించగానే మంచులా కరిగిపోయారు. ఎందుకు ఇలా మోసం చేస్తున్నారన్నా?
వైయస్‌ జగన్‌: బాబు మోసం చేయడమన్నది వింత కాదు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశారు, చదువుకున్న పిల్లలను ఎలా మోసం చేయాలో అన్న అంశంపై బాబు పీహెచ్‌డీ చేశారు. స్వాతంత్య్రం మనకేందుకు బ్రిటిష్‌ వాళ్లు బ్రహ్మండంగా అభివృద్ధి చేస్తారు. మనవద్ద డబ్బు లేదు. మనకేందుకు స్వాతంత్య్రం అనే వారు. మన ఖర్మ ఈ రోజు చంద్రబాబు సీఎంగా ఉండటం
––––––––––
ప్రతిభావంతులైన ఇంజనీర్లు లేరా?: నిఖిల, బీటెక్‌
మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి ఎంతో మంది ఇంజనీర్లు పుట్టిన దేశం మనది. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని మేం ఇంజినీరింగ్‌ చేస్తున్నాం. రాజధాని కట్టడానికి మన ఇంజనీర్లు పనికిరారా? సింగపూర్‌కు చంద్రబాబుకు ఉన్న సంబంధం ఏంటీ?
వైయస్‌ జగన్‌: నీకున్న లె లివితేటలు కూడా బాబుకు లేవు తల్లీ. సింగపూర్‌ వాళ్లకు కాంట్రాక్టు అప్పగిస్తే అవినీతికి పాల్పడవ^è ్చని బాబు ఆలోచన. సింగపూర్‌ వాళ్లకు ఇస్తే కరెప్షన్‌ విషయం బయటకు రాదు. అటు నుంచి అటే చంద్రబాబు అమౌంట్‌ మార్చుకోవచ్చని బాబు ఉద్దేశం. తాత్కాలిక సచివాలయం నిర్మాణం కోసం స్కైర్‌ ఫీట్‌కు రూ.10 వేలు ఖర్చు చేస్తున్నారు. అవినీతి అంటే ఏ స్థాయిలో జరుగుతుందో అనడానికి ఇంతకన్న నిదర్శనం వేరే చెప్పాల్సిన అవసరం లేదు.  ––––––––––––––––
మాట మార్చిన వారిని ఏం చేయాలన్నా: మౌనిక, బీటెక్, ఫైనల్‌
ఎన్నికలకు ముందుకు 5, 10, 15 ఏళ్ల పాటు హోదా తెస్తామన్నారు. అ«ధికారంలోకి  వచ్చిన తరువాత మాట మార్చారు. మాట మార్చిన వారిని ఏం చేయాలన్నా.
వైయస్‌ జగన్‌:రాజకీయాల్లో విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకురావాలి. రాజకీయ నాయకులను కాలర్‌ పట్టుకొని నిలదీసే పరిస్థితి వస్తోందో. అప్పుడే  ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది. లేదంటే అబద్ధాలు, మోసం చేయడం ఎవరైనా చేస్తారు.  మీ మాటలతోనైనా బాబుకు బుద్ధి రావాలి.
–––––––––
ఈయన ఎవరన్నా ఒప్పుకోవడానికి:  గుణశేఖర్, బీటెక్‌
ప్రత్యేక హోదా ఐదు కోట్ల ప్రజల హక్కు. ఇప్పుడు ప్యాకేజీ ఇస్తామంటే చంద్రబాబు ఎలా ఒప్పుకుంటున్నారు. ఈయన ఎవరన్నా ఒప్పుకోవడానికి
వైయస్‌ జగన్‌: వాస్తవం చెప్పాలంటే..ఈ ప్యాకేజీ కూడా లేదు. మనకు ఇవాల్సిన∙దానికన్న ఎక్కువ ఇస్తే దాన్ని ప్యాకేజీ అంటారు. మనకు ఇవ్వాల్సిందే అరకొరగా ఇస్తూ దానికి ప్యాకేజీ అని పేరు పెడితే ప్రజలు ఎలా నమ్ముతారు. కేంద్రం ఏ ప్యాకేజీ ఇవ్వకపోగా అరకొరగా ఇస్తూ ప్రజలను అడ్డగోలుగా మోసం చేస్తుంది.  బాబు పుణ్యమా అంటూ హోదా లేదు. ప్యాకేజీ లేదు. సన్మానాలు చేయడానికి, చేయించుకోవడానికి బాబు, వెంకయ్యలకు బుద్ధి ఉండాలి. 
––––––––––––
నా ఒంట్లో రక్తం ఉన్నంత వరకు నీ వెంటే:  రోహిత్, బీటెక్‌
బాబు ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.  నాకు చంద్రబాబు రూ. 64 వేలు అప్పు ఉన్నాడు.  నేను ఎవరిని అడగాలి. రాజధాని శంకుస్థాపనకు రూ.300 కోట్లు ఖర్చు పెట్టారు. టీడీపీ వాళ్లు మా అమ్మకు ఓటుకోసం డబ్బులిస్తామన్నారు. మాకు వైయస్‌ రాజశేఖరరెడ్డి అన్నం పెట్టారు. ఆయనకే మా ఓటు అని మా అమ్మ అన్నారు. నా ఒంట్లో చివరి రక్తం ఉన్నంతవరకు అన్నా..నీ వెంటే ఉంటా? 
వైయస్‌ జగన్‌: టీడీపీ అధికారంలోకి వచ్చి 25 నెలలు అవుతుంది. ఉద్యోగం ఇస్తామన్నారు. లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటికి ఒక్కొక్కరి రూ.64 వేలు ఇవ్వాలి. అందరికి కలిసి లక్షల కోట్లు బాకీ ఉన్నాడు. అబద్ధాలు, మోసం చేస్తే పిల్లలకు కూడా కాలర్‌ పట్టుకుంటారని బాబు భయపడాలి.
––––––––––
బాబూ..మా సంగతేంటీ: శశిభార్గవి, ఇంటర్‌
నాకు  రాజకీయాలపై అంత అవగాహన లేదు. బాబు మోసాలపై అవగాహన ఉంది. వైయస్‌ఆర్‌ సీఎం హోదాలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. బాబు కూడా సీఎం కదా అలాంటి వ్యక్తి ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి అన్నారు, హోదా అన్నారు. ప్యాకేజీ అన్నారు. మమ్మల్ని కూడా మోసం చేస్తున్నారు. రెండు అక్షరాల హోదా వద్దని,  మూడు అక్షరాలు ఉన్న ప్యాకేజీ తెస్తామని మోసం చేస్తే ఎలా? సామాన్య ప్రజల పరిస్థితి ఏంటన్నా. బాబు తన కొడుకు లోకేష్‌కు ఏదో పదవి ఇచ్చారు...మా పరిస్థితి ఏంటన్నా?
–––––––––––––––––
ఫీజు కడదామంటే డబ్బులు లేవు:  సంపత్‌కుమార్, డిగ్రీ
మొన్న నవంబర్‌ నుంచి పాత నోట్లు రద్దు చేశారు. పరీక్ష ఫీజు కడదామంటే తీసుకోవడం లేదు. బ్యాంకుల్లో డబ్బు లేదన్నా? మా లాంటి విద్యార్థుల జీవితాలో ఆటలాడుతున్నారు. మాలాంటి ఎందరో విద్యార్థులు బ్యాంకుల వద్ద క్యూలో నిలబడ్డారు. వీళ్లకు ఓటు వేసినందుకు సిగ్గుపడుతున్నాం.
వైయస్‌ జగన్‌: పేదలకు డబ్బులు దొరకక  బ్యాంకుల వద్ద లైన్‌లో నిలబడుతున్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తులకు కోట్ల డబ్బులు దొరుకుతున్నాయి. మోడీ నిర్ణయం కంటే రెండు రోజుల ముందు బాబు హెరిటేజ్‌ షేర్లు అమ్ముకున్నారు. దీన్ని ఇన్‌సైడర్‌ ట్రెడింగ్‌ అనరా? సడన్‌గా ప్రధానికి లేఖ రాయాలని ఎవరికైనా ఆలోచన వస్తుందా? భూమిపై స్థలం లేదు. చంద్ర మండలంలో ఇళ్లు కట్టుకుంటామని పీఎంకు లేఖ రాస్తే పిచ్చోడు ఎవరో రాశాడని అనుకుంటారు. ఏకంగా డీమానిటేషన్‌ చేయండని అక్టొబర్‌ 12న బాబు పీఎంకు లేఖ రాశారు. ఆ క్రెడిట్‌ తానే తీసుకోవాలని సెల్ఫ్‌ డబ్బా కొట్టుకుంటున్నారు. వేల కోట్ల రుపాయలు చక్కబెట్టుకున్న తరువాత, ఇవాళ ప్రజలందరు బ్యాంకుల ఎదుట నిలబడి 97 మంది చనిపోయారు. ఇంతకన్న దారుణమైన విషయం ఏది ఉండదు.
–––––––––––––––––
మా జిల్లాను అభివృద్ధి చేయండి:  పూర్ణ, పాలిటెక్నిక్‌
 రాష్ట్ర విభజన జరుగకముందు ప్రతి జిల్లాలో సమాంతరంగా అభివృద్ధి జరిగేది. బాబు సీఎం అయ్యాక మా జిల్లాను మరిచిపోయారు. అంతా గుంటూరు, విజయవాడలోనే చేస్తున్నారు.  మీరు నెక్ట్స్‌ సీఎం అవుతారు. మా జిల్లాను అభివృద్ధి చేయండి.
వైయస్‌ జగన్‌: రాష్ట్రంలో ఎక్కడా కూడా పర్మినెంట్‌ అభివృద్ధి లేదు. అంతా టెంపర్‌వరినే. రైతులను మోసం చేసి భూములు లాక్కున్నారు. ఎక్కడా ఒక్క ఇటుక కూడా వేయలేదు. రాజధాని ఇక్కడే వస్తు్తందని తన వారితో భూములు కొనుగోలు చేయించారు. ఆ తర్వాత రైతులను మోసం చేశారు. రాజధాని ప్రాంతం ఫలాన చోట వస్తుందని తెలిసి కూడా అక్కడరైతులు బాగుపడకుండా, తన బినామీలు భూములు కొనుగోలు చేసిన తరువాత రాజధాని ప్రకటించారు. మన ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రాన్ని బాగు చేస్తా.
––––––––––
మాకెందుకు శిక్షా? :  గోవింద్, డిగ్రీ విద్యార్థి
ప్రపంచంలో ఎక్కడైనా తప్పుచేసిన వారికే కదా శిక్షా? ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు చిక్కుకున్నారు. అయితే మాకెందుకు శిక్షా?
వైయస్‌ జగన్‌: ఓటుకు కోట్లు కేసుల నుంచి బయటపడేందుకు, అవినీతిపై విచారణ జరుగకుండా ఉండేందుకు బాబు హోదాను తాకట్టు పెట్టారు. దేవుడు మొట్టికాయలు వేస్తారు. మీ ఉసురు కచ్చితంగా తగులుతోంది.
––––––––
ఈ మోసగాడు మళ్లీ రాకుడదు:  నాయుడు, పీజీ
చంద్రబాబు ఎన్నికల ముందు ఒక మాట, సీఎం అయ్యాక మరో మాట మార్చారు. ఇంతన్నాడు.. అంతన్నాడు.  ఇటువంటి మాయ మాటలు చెప్పిన బాబును విజయనగర్‌ వస్తే గట్టిగా కాలర్‌ పట్టుకొని నిలదీస్తా. ఇలాంటి మోసగాడు మళ్లీ అధికారంలోకి రాకుడదు. అందరం కూడా ఐక్యంగా ఉంటాం. మీకే మా ఓటు. మీరు సీఎం అవుతారాన్నా..
–––––––––––
అందరికీ న్యాయం చేయండి:  తులసీ, ఇంటర్‌
కులాలను బట్టి కాకుండా అందరికీ ఉపకార వేతనాలు ఇచ్చి న్యాయం చేయండన్నా.
వైయస్‌ జగన్‌: ఈబీసీ అన్నది ఒకటి ఉంది. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఈబీసీ అంటారు. కులం, మతం అన్న తేడా లేకుండా పేదవాడికి కచ్చితంగా మేలు జరిగేలా చర్యలు తీసుకుంటాను.
––––––––––––––
బాబు పోతే జాబు వస్తుంది:  పవన్‌కుమార్,
బాబు ఎన్నికలకు ముందు.. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. మాకు రాలేదన్నా. బాబుకు సీఎం పదవి వచ్చింది.  మా జిల్లాలో మూడు జూట్‌ మిల్లులు మూతపడ్డాయి. ఒక్క యూనివర్సిటీ రాలేదు. బాబును శిక్షించే చట్టం రావాలి. బాబు పోతే జాబు వస్తుంది.
వైయస్‌ జగన్‌: నీ ఉసురు కచ్చితంగా బాబుకు తగులు తుంది. జాబు రావాలంటే బాబు పోవాలన్న నినాదం రావాలి.
––––––––––––––
పింఛన్‌ ఇస్తే సరిపోతుందా:  కామేష్, అంధ విద్యార్థి
నోట్లు రద్దుకు తానే కారణమని చంద్రబాబు అంటున్నారు. ఈయన లేఖ వల్లే ఇది జరిగిందంటున్నారు. హోదా గురించి ఎందుకు లేఖ రాయలేదు. నోట్లు ముందా? హోదా ముందా? హోదా వస్తే వికలాంగులందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మా లాంటి వాళ్ల పరిస్థితి ఏంటీ? రూ.1500 పింఛన్‌ ఇస్తే సరిపోతుందా? హోదా తీసుకురావాలన్నా.
వైయస్‌ జగన్‌: బాబు అనే వ్యక్తి నా లేఖ వల్లే నోట్ల రద్దు జరిగిందని గొప్పగా చెప్పుకుంటున్నారు. తాను సొంతంగా లాభపడి ఇవాళ ప్రజలను బ్యాంకుల ముందు నిలబెట్టారు. నోట్ల రద్దు సొంతంగా చక్కబెట్టుకొనే విషయం కాబట్టి బాబు లేఖ రాశాను. హోదా వస్తే ప్రజలు బాగుపడుతారు. నోట్ల రద్దు వల్ల బాబు ఒక్కరే బాగుపడ్డారు. మీ మాటల వల్ల బాబుకు బుద్ధి రావాలి.
Back to Top