విద్యార్థుల సమస్యలను పరిష్కరించండి

నెల్లూరు: విక్రమ సింహపురి యూనివర్సిటీలోని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి టి. జయవర్ధన్‌ యూనివర్సిటీ ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌ చంద్రయ్యను కోరారు. ఇన్‌చార్జ్‌ రిజిస్టార్‌గా నూతనంగా నియమితులైన చంద్రయ్యను కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. యూనివర్సిటీ నూతన భవనంలో నుంచి పరిపాలన సాగించాలని, అదే విధంగా విద్యార్ధులు ఎదుర్కొంటున్న టీచింగ్‌ సమస్యను పరిష్కరించాలన్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా పరిపాలన సాగించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న క్లాసులను వెంటనే చెప్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు మధన్‌కుమార్‌రెడ్డి, శేషుగౌడ్, మధు, రాకేష్, నిస్సార్, పవన్, నిఖిల్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. 

Back to Top