హామీలు అమలుచేయకపోతే జనం క్షమించరున్యూఢిల్లీ : రాష్ట్ర విభజన చాలా అశాస్త్రీయంగా జరిగిందని, రాష్ట్రానికి గుండె కాయలాంటి రాజధాని లేని రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని  వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌క‌పోతే జ‌నం క్ష‌మించ‌ర‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. బుధవారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్‌ స్ట్రీట్‌లో ఏపీ విద్యార్థుల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాజకీయ ఉద్దేశ్యాలతోనే రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఉంటే విద్యార్థుల జీవితాలు ఎంతో బాగుపడేవని, ఎన్నో పరిశ్రమలు వచ్చి ఉండేవని చెప్పారు. హోదా సాధ‌న‌కు త‌మ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేశార‌ని తెలిపారు. 
Back to Top