జాతీయ నేతలతో జగన్ సమైక్యాంధ్ర చర్చలు

న్యూఢిల్లీ‌, 9 డిసెంబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి జాతీయ నేతలతో సమైక్యాంధ్ర కోసం మంతనాలు జరుపుతున్నారు. సోమవారం ఉదయం  పార్లమెంట్ సమావేశాలకు హాజరయిన ఆయన సభ వాయిదా అనంతరం సమా‌జ్‌వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాద‌వ్‌తో భేటీ అయ్యారు. అడ్డగోలుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని ఈ సందర్భంగా ములాయంను శ్రీ జగన్ కోరారు.‌ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయమై ఈ సమావేశాల్లో వీలును బట్టి శ్రీ జగన్మోహన్‌రెడ్డి జాతీయ  పార్టీల నేతలను మరోసారి కలిసి మద్దతు కోరనున్నట్లు సమాచారం.

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శ్రీ వైయస్ జగ‌న్ ఇటీవల పలు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి పార్టీల నేతల మద్దతు కోరిన విషయం తెలిసిందే. ‌శ్రీ జగన్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆయన మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడను కలిసి సమైక్యాంధ్రకు మద్దతు కోరతారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top