ఏడవ రోజూ జగన్ నిరవధిక నిరాహార దీక్ష

హైదరాబాద్‌, 31 ఆగస్టు 2013:

రాష్ట్ర ప్రయోజనాల కన్నా తన ప్రాణం ముఖ్యం కాదంటూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష ఏడవ రోజు శనివారం కూడా కొనసాగిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు ఆయనను ఉస్మానియా ఆస్పత్రి నుంచి నిమ్సు ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ శ్రీ జగన్మోహన్‌రెడ్డి దీక్షను కొనసాగిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రి నుంచి శ్రీ జగన్‌ను నిమ్సుకు తరలించే సమయంలో పోలీసులు హైడ్రామా నడిపించారు. నిమ్సులో ఫ్లూయిడ్సు ఎక్కించేందుకు వైద్యులు యత్నించారు. అయితే వైద్యం చేయించుకునేందుకు శ్రీ జగన్ ప్రతిఘటించారు. ఫ్లూయి‌డ్సు తీసుకునేందుకు నిరాకరించారు.

మరోవైపున శ్రీ జగన్మోహన్‌రెడ్డికి శనివారం నిమ్సు వైద్యులు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించారు. శ్రీ జగన్ ఆరోగ్యం క్షీణిస్తుండటంపై అభిమానులు, వై‌యస్ఆర్‌ కాంగ్రెస్ ‌నాయకులలో తీవ్ర ఆందోళన నెలకొంది. అటు శ్రీ జగన్‌ను చూసేందుకు జననేత కుటుంబీకులను కూడా అనుమతించలేదు. దీనితో శ్రీ జగన్‌ను దూరం నుంచే చూసి శ్రీమతి వైయస్ విజయమ్మ,‌ శ్రీమతి భారతి, బ్రదర్ అని‌ల్ వెనుదిరి‌గి వెళ్ళాల్సి వచ్చింది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top