వైయ‌స్ జ‌గ‌న్‌తోనే ప్ర‌త్యేక‌హోదా సాధ్యం...

కాకినాడః చంద్ర‌బాబు అన్నివ‌ర్గాల‌ను మోసం చేశార‌ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ రాష్ర్ట అధ్యక్షుడు జం గాకృష్ణమూర్తి అన్నారు. నరేంద్రమోది,చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు ప్రత్యేక హోదాపై తిరుపతిలో చేసిన ప్రకటన ప్ర‌జ‌లంద‌రూ గుర్తుకుతెచ్చుకోవాలన్నారు. టిడిపికి  అండగా ఉన్న బిసి వర్గాలను చంద్రబాబు మోసం చేశార‌ని మండిప‌డ్డారు.  వంచన,మోసం,దుర్మార్గాలకు పేటెంట్ హక్కు చంద్రబాబుకే ఉంద‌న్నారు. చిన్నవాడైనా ముందు చూపు ఉంది కాబట్టిే  వైయ‌స్ జ‌గ‌న్‌ బిసి అధ్యయన కమిటి వేసి ప్రతి బిసి కులం ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేయిస్తున్నార‌న్నారు. బిసి డిక్లరేషన్ లో బిసిలను ఆదుకునేందుకు అనేక పధకాలు ప్రకటిస్తార‌న్నారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ  వైయస్ ఆర్ లా సుపరిపాలన అందించేందుకు వైయస్ జగన్  పనిచేస్తున్నార‌న్నారు.
Back to Top