ప్రత్యేక హోదాను ఖూనీ చేశారు

  • పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీకి తూట్లు పొడిచారు
  • ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు
  • హోదాను బాబు నీరుగార్చడం వల్లే ఈదుస్థితి
  • టీడీపీ, బీజేపీ మోసాలను ప్రజలకు వివరిస్తాం
  • వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్

హైదరాబాద్ః ప్రత్యేకహోదాకు కుంటిసాకులు వెతుకుతూ టీడీపీ, బీజేపీలు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నాయని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రానికి ఇచ్చిన హోదా హామీని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము బీజేపీతోనే కొనసాగుతామని బాబు చెప్పడం దుర్మార్గమన్నారు. ఓటుకు కోట్లు కేసు,  అవినీతిపై విచారణ జరిపిస్తారన్న భయంతోనే బాబు హోదాను నీరుగారుస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైయస్ జగన్ ఏమన్నారంటే...

మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే..
  • ప్రత్యేకహోదాకు సంబంధించి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి నిరసన తెలుపుతూ బంద్ కు పిలువునిచ్చాం
  • ప్రత్యేకహోదా అంశం రాష్ట్ర ప్రజలకు ఎంత అవసరమో వివరిస్తాం. కాబట్టి ప్రతీ ఒక్కరూ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం
  • పార్లమెంట్ లో అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడగొట్టిన మాదిరి ప్రత్యేకహోదాను కూడా అదేపద్దతిలో ఖూనీ చేస్తున్నారు
  • కుంటిసాకులు వెతుకుతూ బీజేపీ హోదా ఇవ్వమని చెబుతుంటే..బాబు ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా అడుగుతారు, నిలదీస్తారు అనుకున్నాం.
  • కానీ బాబు మాట్లాడిన తీరు దారుణంగా ఉంది. హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు. మేం మీ ప్రభుత్వంలోనే కొనసాగుతాం. అల్టిమేటం ఇవ్వబోం. రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగినా పర్వాలేదన్న విధంగా బాబు మాట్లాడడం హేయనీయం. 
  • టీడీపీ, బీజేపీలు ఐదుకోట్ల ప్రజలను మోసం చేస్తున్న తీరుకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చాం
  • బాబు దారుణంగా అబద్ధాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. 
  • ఇంతగా అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తున్నా... నిలదీయలేని పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ఉందంటే దేశ పౌరుడిగా సిగ్గుతో తలదించుకోవాలి. 
  • పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టారు. 
  • హైదరాబాద్ లేనందువల్ల ఏపీకి  నష్టం జరుగుతుంది. దీన్ని పూడ్చేందుకు హోదా ఇచ్చి న్యాయం చేస్తామని ఆనాటి ప్రధానమంత్రి పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు. ఐదేళ్లు సరిపోవు పదేళ్లు ఇవ్వాలని ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ డిమాండ్ చేసింది. 
  • కలిసికట్టుగా హామీ ఇచ్చి ఇవాళ ఎన్నికలయిపోయాయని ప్రజలను మోసం చేస్తున్న తీరును చూస్తే బాధగా ఉంది
  • ఆరోజు నేను పార్లమెంట్ లో హోదా పదేళ్లు అడిగాను. మరుసటి రోజే మిగిలిన రాష్ట్రాల వాళ్లు వచ్చి అడిగారు. తప్పు చేశామని వెంకయ్యనాయుడు చెబుతున్నాడు. 
  • 2014 ఫిబ్రవరి 20న హోదా హామీ ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టాక..ఏఫ్రిలో లో ఎన్నికలకు వెళుతూ బీజేపీ హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామని మేనిఫెస్టో విడుదల చేసింది.
  • ఈ మాదిరి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడం తగునా.
  • నరేంద్ర మోడీనే స్వయంగా తిరుపతి ఎన్నికల సభలో స్పెషల్ స్టేటస్ ఐదేళ్లుకాదు పదేళ్లు ఇస్తామని చెప్పారు. 
  • ఎన్నికలయిపోయాక మాటలు మారుస్తున్నారు. 
  • హోదా ఐదేళ్లు కాదు పదిహేనేళ్లు కావాలి.. అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని బాబు రాష్ట్రాన్ని విడగొట్టేనాడు చెప్పాడు. ఇప్పుడు ప్లేటు ఫిరాయిస్తున్నాడు. 
  • ఎప్పుడైతే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఒక్కో ఎమ్మెల్యేలకు రూ. 20 కోట్లు నల్లధనం ఎరచూపుతూ ఆడియో వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయాడో అప్పటినుంచి బాబు ప్లేటు ఫిరాయించడం మొదలుపెట్టారు. 
  • ప్రత్యేకహోదా ఏమైనా సంజీవనా అంటాడు. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అంటూ హోదాను ఎగతాళి చేస్తున్నాడు. 
  • బాబు ఫిరాయింపు వ్యవహారం ఏస్థాయిలో ఉందంటే రాజధాని శంకుస్థాపనకు మోడీని పిలిచాడు. హోదాను గట్టిగా అడుగుతాడని ఎదురుచూశాం. కానీ, దగ్గరుండి హోదాను నీరుగారుస్తూ మాట్లాడాడు. 
  • చంద్రబాబు హోదాను అడగకపోవడం వల్లే...బీజేపీ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేమని చెప్పే పరిస్థితికి వచ్చింది. బాబు నిర్వాకం వల్లే రాష్ట్రానికి  ఈ దుస్థితి.
  • ఎన్నికల ముందు ఏం చెప్పావ్..ఇప్పుడేం చేస్తున్నావ్ బాబు. 
  • 15 సంవత్సరాలు ప్రత్యేకహోదా ఇవ్వాలని మాట్లాడిన బాబు..లాస్ట్ కొచ్చేసరికి హోదా ఉన్న రాష్ట్రాలు స్వర్గాలయిపోయాయా అంటూ ఎద్దేవా చేస్తున్నాడు. 
  •  పథకం ప్రకారం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతూ  డ్రామాలు ఆడుతున్నాడు.
  • హోదా ఇవ్వలేమని మొహమాటం లేకుండా బీజేపీ చెబుతుంటే..మీతోనే కొనసాగుతానంటూ బాబు ఇంకా మొసలి కన్నీరు కారడం సిగ్గుచేటు

Back to Top