మరికొద్దిసేపట్లో వైయస్‌ జగన్‌ బహిరంగ సభ

సభాస్థలికి తరలివస్తున్న ప్రజలు
గజపతి నగరంలో వైయస్‌ఆర్‌సీపీ జెండాలు రెపరెపలు
విజయనగరంః గజపతినగరంలో జరిగే వైయస్‌ జగన్‌ భారీ బహిరంగ సభకు ప్రజలు తరలివస్తున్నారు. ఇప్పటికే సభాస్థలి జనసంద్రంతో నిండిపోయింది. జననేత వస్తారు..మా సమస్యలపై ప్రసంగిస్తారనే ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు.టీడీపీ అస్తవ్యస్త పాలనకు చరమగీతం పాడి మా బతుకుల్లో వెలుగులు నింపుతారని గజపతి నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల నుంచి ప్రజల అడుగులు స్వచ్ఛందంగా పడుతున్నాయి.జగపతి నగరమంతా వైయస్‌ఆర్‌సీపీ జెండాలు,ప్లెక్సీలతో నిండిపోయింది. జై జగన్‌ అనే నినాదాలు మిన్నంటుతున్నాయి.మహిళలు,యువతతో పాటు అన్నివర్గాల ప్రజలు జననేత భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. నియోజవర్గంలోని సమస్యలను ప్రస్తావించి ప్రజల తరుపున గళం వినిపించడానికి జననేత వస్తున్నారని ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.నియోజకవర్గంలోని రోడ్లు,సాగునీరు, తాగునీరు,విద్య,వైద్యం వంటి మౌలిక సదుపాయాలు కూడా ప్రభుత్వం కల్పించడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాలుగున్నరేళ్ల కాలంలో టీడీపీ కార్యకర్తలకు. నేతలకే లబ్ధి చేకూరిందని, సామాన్యలకు కన్నీళ్లు తప్ప ఏమి మిగలలేదని ప్రజలు వాపోయారు. మా బతుకులు మారాలంటే  రాజన్న బిడ్డ వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రావాలని ప్రజలంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.
 
Back to Top