హైదరాబాద్ః స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ కవి, అభ్యుదయ వాది అవంత్స సోమసుందర్ మరణం బాధాకరమని వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. మహాకవులలో సోమసుందర్ ఒకరని ఆయన పేర్కొన్నారు. తెలుగు సాహిత్యానికి ఆణిముత్యాలను అందించారని, 80 పుస్తకాల ద్వారా తెలుగునేల మీద కురిపించిన భావాలు తెలుగు సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేశాయన్నారు. <br/>నిజాంకు వ్యతిరేకంగా సాగిన పోరాట సమయంలో ఆయన రచించిన కవితల సంకలనం వజ్రాయుధం తెలుగునాట చిరస్మరణీయంగా నిలిచిపోయాయని వైయస్ జగన్ గుర్తు చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.