సోమప్ప సర్కిల్ వద్ద రేపు షర్మిల బహిరంగ సభ

కర్నూలు, 15 నవంబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర వేలాది మంది అభిమానులు, పార్టీ శ్రేణులు వెంట నడుస్తుండగా అప్రతిహతంగా కొనసాగుతోంది. అశేష జనవాహిని వెంట వస్తుండగా షర్మిల పాదయాత్ర నవంబర్‌ 16 శుక్రవారం 30వ రోజున కొనసాగనున్నది.

షర్మిల పాదయాత్ర కర్నూలు జిల్లాలో ప్రవేశించి శుక్రవారానికి తొమ్మిదవ రోజుకు చేరుతుంది. శుక్రవారంనాడు షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర షెడ్యూల్‌ను పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, కర్నూలు జిల్లా‌ పార్టీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి‌ గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో వెల్లడించారు. శుక్రవారం మొత్తం 13 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేస్తారని వారు తెలిపారు.

షర్మిల పాదయాత్ర శుక్రవారంనాడు జిల్లాలోని హెచ్. మోర్వానీ నుంచి ప్రారంభమవుతుందని రఘురాం, వెంటకరెడ్డి తెలిపారు. అక్కడి నుంచి నాలుగవ మైల్‌ క్రాస్ చేరుకుంటుందన్నారు. అనంతరం ఎమ్మిగనూరు మార్కెట్‌ కమిటీ రోడ్‌, శ్రీనివాస సర్కిల్‌, ట్యాంక్‌బండ్‌ రోడ్‌ మీదుగా సోమప్ప సర్కిల్ చేరుకుంటుందని వారు వివరించారు. సోమప్ప సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. బహిరంగ సభ అనంతరం పాదయాత్ర వయా జామియా మసీద్‌, వయా ఎంబి చర్చి, కలుగట్ల రోడ్‌ మీదుగా కొనసాగుతుందన్నారు. అక్కడి నుంచి షర్మిల గణేశ్‌ రైస్‌ మిల్లు వద్దకు చేరుకుని అక్కడ రాత్రికి బస చేస్తారని రఘురాం, వెంకటరెడ్డి తెలిపారు.
Back to Top