వైయస్ఆర్‌ విగ్రహం వద్ద షర్మిల నివాళి

ఖడ్గవలస, (విజయనగరం జిల్లా),

21 జూలై 2013: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 216వ రోజు ఆదివారం విజయనగరం జిల్లా ఖడ్గవలస నుంచి ప్రారంభమైంది. ఖడ్గవలసలో ఆమె మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. ఇక్కడి నుంచి నాగూరు, చిలకం జంక్షన్‌, కార్యవలస మీదుగా రావివలస వరకూ పాదయాత్ర చేస్తారు. రావివలస వద్ద ఆమె మధ్యాహ్న భోజన విరామానికి ఆగుతారు. భోజన విరామం అనంతరం శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగించి ఈ సాయంత్రం శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశిస్తారు. వీరఘట్టం మండలం కెల్ల గ్రామం వద్ద ఆమె శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టనున్నారు.

శ్రీమతి షర్మిల శ్రీకాకుళం జిల్లాలో తొలి రోజు చేసే పాదయాత్ర వివరాలను పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీన‌ర్ ధర్మాన పద్మప్రియ ‌వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు వీరఘట్టం మండలం కెల్ల గ్రామం వద్ద శ్రీకాకుళం జిల్లాలో శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభమవుతుంది. కెల్ల వద్ద సభ ముగిసిన అనంతరం నడిమికెల్ల గ్రామం మీదుగా విక్రమపురం చేరుకుంటుంది. ఆ గ్రామ సమీపంలోనే ఆదివారం రాత్రికి శ్రీమతి షర్మిల బస చేస్తారని రఘురాం, పద్మప్రియ తెలిపారు. శ్రీమతి షర్మిల ఆదివారంనాడు మొత్తం 13.8 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారని వారు వెల్లడించారు.

Back to Top