సింగరేణి కార్మికులపై చిన్నచూపు

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సింగరేణి కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడు నర్ర భిక్షపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల  హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మెరుగైన ఆస్పత్రులు, డిపెండెంట్ ఉద్యోగుల అమలు, డిస్మిస్ కార్మికులకు అవకాశం, ఓపెన్‌కాస్ట్ గనుల నియంత్రణ తదితర వాటిపై ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. ఏటా ఒకనెల వేతనం మొత్తాన్ని ఆదాయపన్ను శాఖకు కార్మికులు చెల్లిస్తున్నారని, వీరిని ఐటీ నుంచి మిన హారుుంచాలని డిమాండ్ చేశారు.

Back to Top