బాబు పోవాలి.. జాబు రావాలి


మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి
కర్నూలు: ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి మాట తప్పారని, నాడు బాబు వస్తే జాబు వస్తుందన్నారని,   కానీ ఇవాళ బాబు పోవాలి..జాబు రావాలని యువత నినదిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర  శనివారం జిల్లాలోని బనగానపల్లె నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. దారి వెంట విఫరీతంగా రైతు కూలీలు తమ సమస్యలు వైయస్‌ జగన్‌కు వివరిస్తున్నారన్నారు.  ఎక్కడ చూసినా జనం తండోపతండాలుగా తరలివచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారని లె లిపారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో రుణమాఫీ అని ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు.  ఇప్పటి వరకు మూడు విడతల్లో రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్న చంద్రబాబు, ఆయన ఇచ్చిన డబ్బులు వడ్డీకి కూడా సరిపోవడం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం రైతుకు ఉపశమనం కల్పించిన పాపాన పోలేదని మండిపడ్డారు. యువత రోడ్లపైకి వస్తున్నారని తెలిపారు. చదువుకున్న ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గుండ్రేవుల ప్రాజెక్టును కూడా విస్మరించారు. గుండ్రెవుల ప్రాజెక్టు 2014 ఆగస్టులో చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానం ఒక్కటి కూడా నెరవేరలేదు. చంద్రబాబు దాదాపు 32 వాగ్ధానాలు ఇచ్చారు..ఇవన్నీ కూడా అలాగే పేరుకుపోయాయని శిల్పా తెలిపారు. వైయస్‌ జగన్‌ కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారని చక్రపాణిరెడ్డి తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top